Indian Para Gold Medallists Get 75 Lakh Cash Reward: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు అంచనాలను మించి రాణించారు. రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు పారిస్ క్రీడల్లో పాల్గొనగా.. 29 పతకాలు సాధించారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు సాధించిన భారత్.. ఈసారి 29 పతకాలు గెలిచింది. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు…
గాంధీ శాంతి పురస్కారాన్ని తమకు ప్రకటించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్ల్లు గీతా ప్రెస్ సోమవారం తెలిపింది. అయితే ఏ విధమైన విరాళాలు స్వీకరించడం తమ సాంప్రదాయం కానందున అవార్డు కింద ప్రకటించిన రూ. 1 కోటి నగదును తాము స్వీకరించబోమని గీతా ప్రెస్ ప్రకటించింది.
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం ఇస్తే రూ.25 లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ).. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అరెస్టుకు దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే 25 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇక, ఇబ్రహీం సన్నిహితుడు షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్‌పై రూ. 20 లక్షలు, సహచరులు హాజీ…
బీహార్ రాష్ట్రంలోని గయాలో నివసించే ఆ కుటుంబానికి పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. పక్షులను కూడా సొంత బిడ్డల తరహాలో అపురూపంగా చూసుకుంటారు. అయితే కొన్నిరోజులుగా శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త, సంగీత గుప్త దంపతులు పెంచుకుంటున్న చిలుక కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబం నానా హైరానా పడుతోంది. తాము అనేక రకాలుగా ప్రయత్నించినా చిలుక కనపడలేదని శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ చిలుక కనిపించడం…