‘మెగా’ నటుడు సాయిధరమ్ తేజ్ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్ తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అయితే బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక…