అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత అక్కడ అభివృద్ధి పనుల కోసమంటూ భూములను ఎకరా రూ.10 కోట్ల చొప్పున అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని ఆనాడు స్మశానం అని ప్రచారం చేసి ఈరోజు ఎకరం భూమి రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైసీపీ నేతలను లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి…
రాజధాని అభివృద్ధి నిధుల సేకరణకు అమరావతిలోని భూములను విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 248.34 ఎకరాలను అమ్మాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. కనీస ధర ఎకరాకు రూ.10 కోట్లుగా నిర్ధారించింది. ఈ మేరకు వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ 389 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. భూముల విక్రయం ద్వారా ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున రూ.2,480 కోట్లను ప్రభుత్వం సేకరించనుంది. గతంలో బీఆర్ శెట్టి మెడిసిటీ కోసం కేటాయించిన 100 ఎకరాలు, లండన్…