ఏపీ ప్రభుత్వం 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయగా…. ప్రజాభిప్రాయ సేకరణలో చుక్కెదురైంది. బుధవారం నాడు తుళ్లూరు మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. ఈ సందర్భంగా 16 గ్రామాలు అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఇప్పటికే ఈ విషయంపై పలుచోట్ల అధికారులు గ్రామ సభలు నిర్వహించగా ఈరోజు ఆఖరి గ్రామ సభను తుళ్లూరులో నిర్వహించారు. 2014లో సీఆర్‌డీఏ చట్టంలోని 29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్‌కు తాము అనుకూలమని…
ఆంధ్రుల ఆత్మవిశ్వాసమైన అమరావతిని చిన్నాభిన్నం చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.. చరిత్రను తొలగించాలనే కుళ్లు కుట్రతోనే పాఠ్యాంశాన్ని కూడా తొలగించారని ఆరోపించిన ఆయన.. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టును కుట్రతో నాశనం చేస్తున్నారని విమర్శించారు.. ఇక, కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో వైసీపీ ఉందంటూ ఎద్దేవా చేశారు అనగాని.. ఇప్పటి నుంచి కష్టపడితే అమరావతిని 4 నెలల్లో అగ్రస్థానానికి తీసుకెళ్లొచ్చని సూచించిన…