Jaishankar: భారత-రష్యా సంబంధాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారత రష్యా చరిత్రను పరిశీలిస్తే.. భారత ప్రయోజనాలను ప్రభావితం చేసేలా రష్యా ఎప్పుడూ ఏమీ చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్ సమావేశం కోసం రష్యాకి వెళ్తున్న సందర్భంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రష్యా, ఇండియా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించలేదని చెప్పారు.
India-Canada Dispute: కెనడా- భారత్ మధ్య ఉద్రిక్తత తగ్గడం లేదు. ఈ గొడవ కారణంగా వ్యాపార ప్రపంచం ప్రభావితం అవుతుంది. ఆనంద్ మహీంద్రా కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కెనడియన్ సంస్థ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్‌తో తన భాగస్వామ్యాన్ని ముగించుకుంది.
Canada-India Issue: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల వాణిజ్యం నష్టాలను చవిచూస్తోంది. ముఖ్యంగా కెనడా దీని వల్ల ఎక్కువగా ప్రభావితమవుతుంది, ఎందుకంటే అక్కడ అనేక రంగాలు, వ్యాపారాలలో భారతీయుల సహకారం పెద్దగా ఉంటుంది.
Canada-India Issue: కెనడా- భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. కెనడియన్ డబ్బు భారతీయ స్టాక్ మార్కెట్‌లోని అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టబడింది.