Camel Killed Owner in Uttar Pradesh: ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ ఒంటె యజమాని ప్రాణాలనే పొట్టన పెట్టుకుంది. నీరు పెడుతుండగా మహిళ ప్రాణాలను తీసింది. మహిళ గొంతును నోటితో కరచుకొని దవడలతో పీక నొక్కేసింది. దీంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడిలో చనిపోయిన మహిళను తోతా దేవిగా గుర్తించారు.…