కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ నేటి నుంచి అమలులోకి రాబోతుందంటూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది.
త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వివాదస్పదమైన 'పౌరసత్వ సవరణ చట్టం-2019'పై ఇవాళే రూల్స్ నోటిఫై చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత నేడు వాస్తవరూపం దాల్చనున్నట్లు సమాచారం.