ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు అందించారు.
కిలారు నవీన్ దర్శకత్వంలో వెంకటరత్నం నిర్మించిన చిత్రం ‘మరో ప్రపంచం’. వెంకట్ కిరణ్, సురైయ పర్విన్, యామిన్ రాజ్, అక్షిత విద్వత్, శ్రీనివాస్ సాగర్ ప్రధాన పాత్రధారులు పోషించిన ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ట్రైలర్ విడుదల చేయగా, చిత్ర పోస్టర్ లుక్‌ను దర్శకులు సాగర్ కె చంద్ర, సాయికిరణ్ అడివి విడుదల చేశారు. అనంతరం నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ”డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ…
యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’ చిత్రం టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. తాజాగా ‘గాడ్సే’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్విట్టర్ లో ఈ టీజర్ లింక్ ను షేర్ చేస్తూ చిరు హీరో సత్యదేవ్, దర్శకుడు గోపి, సినిమా నిర్మాత సి కళ్యాణ్ లను అభినందించారు. టీజర్ విషయానికొస్తే… 1.18 నిమిషాల నిడివితో…
సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ నిన్న మీడియాతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న టిక్కెట్ ధరల సమస్యపై ఆయన కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్‌గారు పరిశ్రమకు సాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇది తీవ్రమైన సమస్య. ఇప్పుడున్న టిక్కెట్ ధరల సమస్యపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి. అఖండ పూర్తిగా బాలకృష్ణ స్టామినా. వైఎస్‌ఆర్ హయాంలో చిరంజీవి సినిమాకు ఇలాంటి సమస్య వచ్చింది. ప్రజల నుంచి చెడ్డపేరు వస్తుందని అధికారులు హెచ్చరించినా ఆయన టిక్కెట్ ధరలకు అనుమతి ఇచ్చారు.…