సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీ లూటీ చేస్తున్నారు… ‘గాడ్సే’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’ చిత్రం టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. తాజాగా ‘గాడ్సే’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్విట్టర్ లో ఈ టీజర్ లింక్ ను షేర్ చేస్తూ చిరు హీరో సత్యదేవ్, దర్శకుడు గోపి, సినిమా నిర్మాత సి కళ్యాణ్ లను అభినందించారు.
Wishing all the very best to dear @ActorSatyaDev @MeGopiganesh #CKalyan and the entire team of #Godse #𝐆𝐎𝐃𝐒𝐄Teaser https://t.co/bF7loUZLnW@AishuLekshmi @actorbrahmaji @NagaBabuOffl @mrnoelsean @CKEntsOffl #SunilKashyap @vamsikaka @adityamusic
Also Read
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 20, 2021
టీజర్ విషయానికొస్తే… 1.18 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ ‘గాడ్సే’ పాత్రలో నటిస్తున్న సత్య దేవ్ అవినీతి రాజకీయాలను అరికట్టాలనే లక్ష్యంతో ఉన్న యువకుడిగా చూపిస్తుంది. ఆయన కోసం అధికారులు గాలిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి విచారణ అధికారి కన్పించింది. ఇక టీజర్ లో “ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు…” అంటూ టీజర్ స్టార్ట్ కాగా “సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి… కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నారా? ఎందుకంటే మీరంతా సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీ లూటీ చేస్తున్నారు” అంటూ సత్యదేవ్ ఆవేశంగా ప్రశ్నించడం ఆలోచింపజేస్తుంది. టీజర్లో సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
2018లో విడుదలైన “బ్లఫ్ మాస్టర్” చిత్రంతో విజయం అందుకున్న సత్య దేవ్… నెక్స్ట్ ప్రాజెక్ట్ గా దర్శకుడు గోపీ గణేష్ పట్టాభితో కలిసి ‘గాడ్సే’ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. ‘గాడ్సే’ను సికె స్క్రీన్స్ బ్యానర్‌పై సి కళ్యాణ్ నిర్మించారు. నాజర్, సాయాజీ షిండే, కిషోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, నాగబాబు, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నారు. గోపీ గణేష్ పట్టాభి ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించడంతో పాటు ‘గాడ్సే’కి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా రాశారు.
తాజావార్తలు
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!