‘‘హర్ ఘర్ తిరంగా జెండా‘‘ కార్యక్రమంలో భాగంగా అమ్మనబోలులోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. దేశ భక్తి పాటలు, స్వాతంత్ర సమరయోధుల వీరోచిత పోరాటాల గీతాల ఆలాపనతో పాదయాత్ర శిబిరం సందడిగా మారింది. ఆజాదీ కా అమ్రుత మహోత్సవ్ లో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 15న వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించే విషయంలో ప్రతి…