Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి పై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు జ్యూడిషియల్ వ్యవహారాలపై మాట్లాడొద్దని స్పష్టంగా చెప్పినా, సీఎం సభలో కోర్టును ధిక్కరించి మాట్లాడారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో ఎలాంటి పరిణామాలు జరగలేదని, ఇప్పుడు కూడా ఏమీ కాదని సీఎం సభలో వ్యాఖ్యానించారని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా ఏమీ కాదని చెప్పడం ద్వారా సీఎం తన పరిధిని దాటి సుప్రీంకోర్టు పై మాట్లాడారని…
రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ , రెండు వైస్ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి రూరల్ (మం) ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. చంద్రగిరి (మం) రామిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ ఉమ, యర్రావారిపాళెం, చింతకుంట ఉప సర్పంచ్ రమేష్ నాయుడు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. READ MORE: CM Chandrababu: ఇవాళ రెండో రోజు కలెక్టర్ల…
Kadiyam Srihari: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. సుప్రీం కోర్టులో ఉన్న MLAల అనర్హత కేసుపై ఈ నెల 10న తీర్పు వెలువడనుంది. ఈ తీర్పును తాను తప్పకుండా శిరసావహిస్తానని ఆయన స్పష్టంగా తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం ఉపఎన్నికలు జరిగితే, తాను తప్పకుండా పోటీ చేస్తానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఇందులో వెనుకడుగు తీసుకునే ఆలోచన లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. BRS పార్టీపై తీవ్ర…
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు బుధవారం ఓటింగ్ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.
By-elections in Munugode, Adampur, Andheri East and 4 other seats: తెలంగాణలో మునుగోడుతో పాటు దేశవ్యాప్తంగా పలు కీలక అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల కాలంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా ఆ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికలకు కీలకంగా మారాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఈ రోజు జరగుతున్నాయి.…
కాంగ్రెస్‌కు హుజురాబాద్‌లో కొత్త కష్టాలు మొదలయ్యాయి. లోకల్‌పార్టీ నాయకులు సరికొత్త రాగం అందుకున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖకు టికెట్ ఇస్తున్నారని తెలియడంతో.. లోకల్ మంత్రం జపిస్తున్నారట అక్కడి కాంగ్రెస్ నాయకులు. అదే పీసీసీ పెద్దలను చికాకు పెట్టిస్తోందట. హుజురాబాద్ కాంగ్రెస్ నేతల కొత్త రాగం! హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలకు భిన్నంగా వెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అక్కడ ఉన్న ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడం మొదటి లక్ష్యమైతే.. బలమైన అభ్యర్థిని బరిలో దించితే పరువు కాపాడుకోవచ్చన్నది మరో…
హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు పోటీ చేయాలి అని వైస్సార్ తెలంగాణ పార్టీ తెలిపింది. రాష్ట్రంలో నిరుద్యోగులు వందల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోంది. నోటిఫికేషన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. రేపు, మాపు అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతోంది. యువత ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే.. వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి కేసీఆర్ మెడలు వంచాలని వైస్సార్ తెలంగాణ…