దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తన హవా కొనసాగించింది. మొత్తం 7స్థానాల్లో ఎన్నికలు జరగగా.. బీజేపీ 3 సీట్లను కైవసం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకరనాథ్, హర్యానాలోని ఆదంపూర్‌లో బీజేపీ విజయం సాధించగా, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో ఆధిక్యంలో ఉంది.