ఉక్రెయిన్‌పై రష్యా భీకర స్థాయిలో దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. అటు రష్యా కూడా ఎప్పుడు ఏం జరుగుతోంది తెలియక సతమతం అవుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వస్తువు ఏమైనా ఉందంటే.. అది కండోమ్ అని ఆ దేశపు ప్రముఖ ఆన్‌లైన్ రీటెయిలర్ వైల్డ్‌బెర్రీస్ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం రష్యాలో కండోమ్ అమ్మకాలు 170 శాతం పెరిగాయని…
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి డిసెంబరు మాసంలో అమ్మకాల జోరును చూపించలేకపోయింది. అమ్మకాల పరంగాచూస్తే, 2021 డిసెంబరులో మారుతి సుజుకి కార్ల అమ్మకాల్లో 4 శాతం క్షీణత కనిపించింది. కిందటి నెలలో మారుతి 1,53,149 వాహనాలు విక్రయించింది. 2020 డిసెంబరులో మారుతి సంస్థ 1,60,226 కార్లు విక్రయించింది. 2021 నవంబరులో 1,39,184 కార్లు విక్రయించినట్టు తాజా ప్రకటనలో మారుతి సంస్థ వెల్లడించింది. Read Also:సర్కార్‌ను మేల్కొల్పడమే జాగరణ లక్ష్యం: బండిసంజయ్ డిసెంబరులో అమ్మకాలు కాస్త…
కేంద్రం ఆదాయం కోసం దేన్నీ వదలడం లేదు. తాజాగా కేంద్రం టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ రేటు పెంచాలని భావించింది. అయితే వస్త్ర వ్యాపారుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఆ నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీపికబురు అందించారు. టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ రేటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది. అదేసమయంలో కొనుగోలు దారులకు కూడా ఊరట కలుగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని…
భారత్ కు చెందిన విప్రో కంపెనీ అమెరికాకు చెందిన లీన్ స్విఫ్ట్ సోల్యూషన్స్ ను సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఒప్పందాలు బుధవారం రోజున పూర్తి చేసినట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ బిజినెస్‌ను విస్తరించడానికి విప్రో లీన్ స్విఫ్ట్ సోల్యూషన్స్‌ను కొనుగోలు చేసింది. 2022 మార్చి 31 తో లీన్ స్విఫ్ట్ పూర్తిగా విప్రోలో విలీనం అవుతుంది. యూఎస్, స్వీడన్, భారత్ లో లీన్‌స్విఫ్ట్ కంపెనీ కార్యాలయాలను కలిగి యుంది. పంపిణీ, రసాయనాలు, ఫ్యాషన్,…
ఓవైపు కొత్త సంస్థలు వస్తున్నాయి, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెబుతున్నారు.. మరోవైపు లక్షల్లో సంస్థలు మూతపడుతున్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది.. దాదాపు ఆరేళ్లలో భారత దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా సంస్థలు మూతపడినట్టు కేంద్రం వెల్లడించింది.. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,00,506 కంపెనీలు మూతపడినట్టు లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా…
భారత వ్యాపార రంగంలో ఎంతో పేరున్న గోద్రేజ్ గ్రూపు విభజనకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. త్వరలోనే ఈ వ్యాపార సామ్రాజ్యం రెండుగా చీలనుంది. దీనికి సంబంధించి అన్నదమ్ములు ఇద్దరూ వ్యాపారాలను పంచుకునేందుకు నిర్ణయించుకున్నారని వినికిడి. 124 ఏళ్ల ఈ వ్యాపార సామ్రాజ్యం విలువ ప్రస్తుతం4.1 బిలియన్ డాలర్లు. సబ్బులనుంచి మొదలు గృహోపరకరణాల రంగంలో గోద్రేజ్‌కు సాటిలేదు. ఇప్పటికే ఆస్తుల పంపకానికి సంబంధించి న్యాయ సహాలను సైతం తీసుకుంటున్నారని తెలిసింది. గోద్రేజ్ గ్రూప్ చైర్మన్‌గా ప్రస్తుతం ఆది గోద్రేజ్(79)…
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం వసూళ్ళలో దూసుకుపోతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి వేరే ఏ చిత్రం పోటీలో లేకపోవడంతో ఈ వారం రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి.. ఆలస్యం అమృతంలా పనిచేసిందనే చెప్పాలి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఏర్పడంతో థియేటర్లోనూ అలరిస్తోంది. ఓపెనింగ్స్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టుకోగా.. మరోవైపు యూఎస్…
భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి సెన్సెక్స్ 60 వేల మార్క్ దాటింది. అలాగే నిఫ్టీ 18 వేల పాయింట్లకు చేరువవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్ సెన్సెక్స్ 60 మార్కు దాటింది. మరోవైపు నిఫ్టీ సైతం 18000 కీలక మైలురాయి దిశగా పరుగులు తీస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలూ మార్కెట్…
చాలా కాలం తరువాత స్టాక్ మార్కెట్లు భారీగా లాభ పడ్డాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం అయినప్పటి నుంచి భారీ లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఒకదశలో వెయ్యి పాయింట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఉదయం సెన్సెక్స్ 59,275 పాయంట్లతో ప్రారంభమయ్యి లాభాల దూకుడును ప్రదర్శించి 985.03 పాయింట్ల లాభంతో 59,885.36 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ తో పాటుగా నిఫ్టి కూడా దూకుడు ప్రదర్శించింది. 276.30 పాయింట్ల లాభంతో 17,823 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్…