వంట నూనెల ఎంఆర్‌పీని 10 రూపాయలు తగ్గించాలన్న కేంద్రం ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల రేట్లు దిగొచ్చిన నేపథ్యంలో వాటి గరిష్ట చిల్లర ధరను ఆ మేరకు సవరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దిగుమతి చేసుకునే నూనెల ఎంఆర్‌పీని 10 రూపాయలు తగ్గించాలని అడిగింది. మన దేశం వంట నూనెల వినియోగంలో 60 శాతానికి పైగా సరుకును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రూపాయి విలువను పెంచేందుకు చర్యలు ప్రకటించిన ఆర్బీఐ ఈ ఏడాది…
పబ్లిక్ ఆఫర్ పట్ల పునరాలోచనలో పడ్డ 3 స్టార్టప్‌లు? ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల విషయంలో అంటే ఐపీఓల విషయంలో 3 స్టార్టప్‌లు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఫార్మ్‌ఈజీ, బోట్, ఇక్సిగో అనే ఈ మూడు సంస్థల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. అన్‌లిస్టెడ్ ఈక్విటీ మార్కెట్‌లో వీటి షేర్లకు క్రేజ్ తగ్గింది. దీంతో ఐపీఓల పట్ల ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపట్లేదని వార్తలొస్తున్నాయి. పబ్లిక్ ఆఫర్‌లో పాల్గొని పేలవమైన ప్రదర్శన చేయటం ద్వారా బ్రాండ్ వ్యాల్యూని ఇంకా…
హైదరాబాద్ లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూడడం కలకలం రేపుతోంది.. లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు నిర్వాహకులు.. ఆ తర్వాత డబ్బులు చెల్లించాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు.
చిన్నతనంలో సరిగా చదవకపోయినా, పరీక్షల్లో మార్కులు సరిగా రాకపోయినా పెద్దయ్యాకా గాడిదలు కాస్తావా.. అంటూ చాలా మంది అంటుంటారు. కానీ ఓ ఐటీ ఉద్యోగి తన ఉద్యోగాన్ని, ఆరంకెల జీతాన్ని వదిలి గాడిదలు కాస్తున్నాడు. నిజమేనండోయ్.. గాడిదల పెంపకాన్ని సాక్షాత్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరే వృత్తిగా చేపట్టి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మంగళూరు నగరానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి మంగళూరులో గాడిద పాల ఫారంను ప్రారంభించారు. లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ…
కొంతమందికి వృత్తి… ప్రవృత్తి ఒకటే వుంటుంది. మరికొందరికి చెప్పే వృత్తి ఒకటి.. చేసేది మరొకటి. హైదరాబాద్ పాతబస్తీలో బట్టల వ్యాపారము చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. అందులో విశేషం ఏముంది అదీ వ్యాపారమే కదా అనకండి. అక్కడే ట్విస్ట్ వుంది. వారు బట్టల వ్యాపారం మాటున కత్తులు,తల్వార్లను అమ్ముతున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వీరి నుండి తల్వారు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. బండ్లగూడ, నూరినగర్, జహంగీరాబాద్ కు…
అమ్మతనం దేవుడిచ్చిన వరం. గతంలో ప్రసవానికి ఆస్పత్రులకు వెళ్లేవారు. డాక్టర్ చెప్పిన విధంగానే ప్రసవాలు జరిగేవి. నార్మల్ డెలివరీలే ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు తరం మారింది. వారి ఆలోచనలు కూడా మారాయి. ముహుర్తం చూసుకుని మరీ పిల్లలను కంటున్నారు నేటి తరం అమ్మలు. పిల్లలు ఎప్పుడు పుట్టాలో కుటుంబ సభ్యులు నిర్ణయిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణ కాన్పుల సంఖ్య భారీగా తగ్గడంతో. సర్కారు మహుర్తపు కాన్పులను తగ్గించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల…
నిర్మాణారంగానికి ప్రధానంగా అవసరమయిన సిమెంట్ మంట పెడుతోంది. ధరలు భగ్గమంటున్నాయి. ఈ నెలలోనే మరో 50 రూపాయల వరకు ధర పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీగా ఉన్న సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం తడిసి మోపెడవుతోంది. సిమెంట్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నెలలోనే బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. సిమెంట్ తయారీలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం కోక్ గత 6 నెలల్లో 30…