EMIs High-No Extension: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మరోసారి రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే లోన్లు తీసుకున్నవాళ్ల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరుగుతుందా?.. లేక.. ఈఎంఐ మరింత భారంగా మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ రెపో రేటు పెరిగిన ప్రతిసారీ వినియోగదారులు ఈఎంఐ అమౌంట్‌ని పెంచుకోకుండా లోన్ రీపేమెంట్ డ్యూరేషన్‌ని పెంచుకునేవారు.
IPO: స్టాక్ మార్కెట్ బిజినెస్ అంటే ప్రపంచ స్థాయి కంపెనీలతో పార్ట్నర్‌షిప్ ఏర్పాటుచేసుకోవటం. షేర్ హోల్డర్‌గా మారటం ద్వారా ఆయా కంపెనీలతో కలిసి ప్రయోజనాలను పొందటం. షేర్ హోల్డర్‌గా మారటానికి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ఐపీఓ. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే కంపెనీలు డైరెక్ట్‌గా వాళ్లదాంట్లో వాటాను ఆఫర్ చేయటం. చాలా మంది ఏమీ తెలియకుండా ఐపీఓకి అప్లై చేస్తుంటారు.