ఒకే నెంబర్‌తో 3 ఆర్టీసీ బస్సులు… ఆర్టీవో అధికారుల షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదో ఆర్టీసీ బస్సు.. కానీ ఒకే నెంబర్‌తో మూడు బస్సులు ఉన్నాయి. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించే వరకు బయటికి రాలేదు. తెలంగాణ ఆర్టీసీలో ఒకే నెంబర్‌తో మూడు బస్సులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. గరుడప్లస్, సూపర్‌లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, ఈ మూడు బస్సులకు ఒకే నెంబర్ ఉంది.
ఆ మూడు బస్సులపై ఫైన్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్ వన్ డిపోలో టీఎస్ 08 z 0208 ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్ సర్వీసుగా నడుస్తుంది. హైదరాబాద్ 3 డిపోలో గరుడప్లస్ సర్వీస్ కూడా అదే నెంబర్‌పై తిరుగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూడు బస్సులను గుర్తించిన ఆర్టీఓ అధికారులు వాటిపై చలాన్లు విధించారు. ఒకే నెంబర్‌పై ఉన్న ఈ మూడు బస్సులకు హైదరాబాద్ పరిధిలో రెండు, సైబరాబాద్‌పరిధిలో రెండు చలాన్లు ఉన్నాయి. రాచకొండ, ఆదిలాబాద్, సిద్ధిపేట, కరీంనగర్ పరిధిలోనూ ఒక్కో చలాన్ ఉంది.
Also Read
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ - ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!
మొత్తంగా ఒకే నెంబర్‌పై ఎనిమిది చలాన్లు ఉన్నాయి. కానీ బస్సులు మాత్రం మూడు ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన ఆర్టీవో అధి కారులు అసలు వ్యవహారాన్ని గుర్తించారు. అసలు ఒకే నెంబర్ మీద మూడు బస్సులు ఎలా తిరుగుతున్నాయి..? ఆ బస్సులకు ఒకే నెం బర్ ఎందుకు కేటాయించారనేది తెలియదు. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
గతంలో ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాలు ఒకే నెంబర్ మీద రెండు అంతకన్నా ఎక్కువ బస్సులు నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పు డు ఆర్టీసీలో సైతం ఇలాంటి ఘటనలు వెలుగు చూడటంతో ఆర్టీవో అధికారులు ఖంగుతిన్నారు. ఒకే నెంబర్ మీద మూడు బస్సు లు ఎలా తిరుగుతున్నాయి. ఈ ఘటన ఎలా జరిగిందని అటు టీఎస్ ఆర్టీసీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఈ బస్సులు ఎప్పటి నుంచి ఇలా తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు దీన్ని ఎందుకు గుర్తించలేదని అధికారులు కూపీ లాగుతున్నారు.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!