మెక్సికో దేశంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈశాన్య మెక్సికోలోని తమౌలీపాస్ రాష్ట్రంలో బస్సు ప్రమాదం జరిగింది. రేనోసా-న్యూవోలియోన్ మోంటెర్రే మధ్య బస్సు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వేగంగా ప్రయాణం చేస్తుండటంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.