Group War in TDP: అనంతపురం జిల్లాలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర సాక్షిగా టీడీపీలో విభేధాలు రచ్చకెక్కుతున్నాయి. పెనుకొండలో తెలుగు తమ్ముళ్లు ఒకరిని ఒకరు కొట్టుకోగా, మడకశిర ఏకంగా యాత్రనే వాయిదా వేయించారు. ఈ నియోజకవర్గాల్లో గ్రూపు పాలిటిక్స్‌కు చెక్ పెట్టాలని చూసిన నేతలకు జరుగుతున్న పరిణామాలు తలనొప్పిగా మారాయి. జిల్లాలోని నియోజకవర్గాల్లో టిడిపి నేతల మధ్య వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బస్సు యాత్ర సాక్షిగా తెలుగు తమ్ముళ్లు ముష్ఠిఘాతాలకు దిగుతున్నారు. గత కొంతకాలంగా పెనుగొండలో జిల్లా అధ్యక్షులు బికే పార్థసారథి, మహిళా నేత సవితమ్మ మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది. ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్ని స్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని సవితమ్మ డిమాండ్ చేస్తున్నారు. పార్థసారథి నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. ఐతే ఇక్కడ పట్టు సాధించుకునేందుకు ఇద్దరు నేతలు పోటాపోటీగా వ్యూహ ప్రతి వ్యూహాలను అమలు చేస్తుండటం ఘర్షణలకు దారితీస్తోంది. సీనియర్ , జూనియర్ అంటూ మడకశిరలో నేతలు అధిపత్యపోరుతో ఈనెల 27 న జరగాల్సిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సుయాత్ర తాత్కాలికంగా వాయిదా వేయించారు.మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం యాత్రలో పాల్గొంటే తాము పాల్గొనమని గుండుమల తిప్పేస్వామి వర్గీయులు తెగేసి చెప్పారు.దీంతో పాటు వాట్సప్ లలో మెసేజ్ స్తెతం ఫార్వర్డ్ చేశారు.ఇదే విషయాన్ని గుండుమల వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం జరగాల్సిన నియోజకవర్గంలో జరగాల్సిన బస్సు యాత్ర కాస్తా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మారింది.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర టీడీపీలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. రేపు జరగాల్సిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం యాత్రలో పాల్గొంటే తాము పాల్గొనబోమని తెగేసి చెబుతున్నారు గుండుమల తిప్పేస్వామి వర్గీయులు. ఇక…ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు పార్టీ నేతలు. మరోవైపు…నిన్న పెనుకొండ నియోజకవర్గ టీడీపీలోనూ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయ్. పార్టీ నేతలు చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, సవితమ్మ వర్గాల మధ్య గొడవ జరిగింది. పెనుకొండలో వీరిద్దరికి వేర్వేరుగా ఆఫీసులు ఉన్నాయి. సవితమ్మ ఆఫీసులోకి నాయకుల్ని రమ్మనడంతో బీకే పార్థసారథి వర్గం అభ్యంతరం తెలిపింది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.