Roja Selvamani: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా తణుకులో జరిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎడ్ల బలప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఎడ్లబండిని తోలుతూ ఉత్సాహంగా కనిపించారు. ఆమె ఎడ్లబండిని తోలిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.…