Atrocious: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సాంకేతికంగా ఎంతగా ముందుకు వెళ్తున్నప్పటికీ గ్రామాల్లోని అనేకమంది ఇప్పటికీ సంప్రదాయ వైద్యంపై ఆధారపడుతున్నారు.
సాంకేతికంగా ప్రపంచం ఎంతగా అభివృద్ది చెందుతుంటే… అంతగా మూఢనమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. రోగాలు నొప్పులకు నాటువైద్యం, పాము కరిస్తే కోడితో వైద్యం చేయడం చూశాం. అప్పట్లో దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాము కరిస్తే ఎవరైనా వైద్యుని వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షేర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల దేవేంద్రి పాముకాటుకు గురైంది. వంట చెరుకు సేకరణకు వెళ్లిన సమయంలో…