తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడంపై ఆయన మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మంట కలిపేలా ఉంది. మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నవా? రాష్ట్రపతి ప్రతినిధిని, రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే…