టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం టీడీఎల్పీ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. సమావేశం అనంతరం అసెంబ్లీకి హాజరు కాకూడదని ప్రకటించనుంది టీడీఎల్పీ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబునాయుడు. మెజార్టీ ఎమ్మెల్యేలు మాత్రం బాబు లేకుండా వెళ్లిన లాభం లేదని భావించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 తేదీనుంచి జరగనున్నాయి.…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభంకాబోతున్నాయి.. ఈ సమావేశాల్లోనే వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది సర్కార్.. అయితే, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.. ఇవాళ సమావేశమైన టీడీపీ పొలిట్ బ్యూరో… అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చింది.. అయితే, టీడీఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.. పొలిట్‌బ్యూర్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పార్టీ నేత కాలువ శ్రీనివాసులు.. కౌరవ సభను తలపించేలా అసెంబ్లీ సమావేశాలు…
బీజేపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. బీజేపీ నేతలను మెంటల్ ఆసుపత్రులలో చేర్పిస్తారన్నారు హరీష్ రావు. ప్రొరోగ్ అంశం స్పీకర్ పరిధి లోనిది. బీజేపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలో తెలియక.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గవర్నర్ మహిళ కదా అందుకే సభకు పిలవడం లేదంటుంది బీజేపీ. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం నీ అవమానించాయి. అస్సాం సీఎం వ్యాఖ్యలు సమర్ధించారు బండి సంజయ్. మమత…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగం వుండడం లేదు. ఈ వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తీవ్రంగా తిప్పికొట్టారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలపై బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సీఎం కెసిఆర్ సమక్షంలో సభలు హుందాగా జరిగాయి..జరగబోతున్నాయి. అధికార పార్టీ సభ్యుల కంటే…ప్రతిపక్ష పార్టీ సభ్యులకే ఎక్కువ సమయం ఇస్తుంది మేమే. విపక్ష సభ్యులు ఇక చాలు అనే వరకు సమాధానాలు ఇస్తున్నాం. .…
తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్, బీజేపీలు వరుసగా మాటల దాడి చేస్తూనే వున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పై మళ్ళీ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై సోమవారం తీవ్ర విమర్శలు చేశారు. వేములవాడలో బండి సంజయ్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మహా శివరాత్రి అనేది అనుకోకుండా వచ్చే పండగ కాదు. వేములవాడలో శివరాత్రి సందర్భంగా ఒక…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు రాష్ట్రపతి. ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. భారత వ్యాక్సిన్లు కోట్లాదిమంది ప్రాణాలు కాపాడాయన్నారు. ఏడాది కంటే తక్కువ వ్యవధిలో 150 కోట్ల మందికి వ్యాక్సినేషన్లు అందించామన్నారు రాష్ట్రపతి. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లేవన్నారు. కనీసం ఈసారి కేంద్ర…
ఇవాళ్టి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆయనకు ఇదే ఆఖరి ప్రసంగం అవుతుంది. రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన అరగంట తర్వాత లోక్‌సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభ…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను షిఫ్ట్‌లవారీగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించే విధంగా సీట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ అధికారి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను సురక్షితంగా…
2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ‘ఆత్మ నిర్భర్ భారత్’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి… అన్ని రంగాలకూ సమన్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా వస్తువుల ధరల్లో తగ్గుదల, పెరుగుదల కనిపిస్తుంది. తాజా బడ్జెట్ నేపథ్యంలో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏయే…