కర్నూలు జిల్లా ఆత్మకూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి ఏకంగా బీజేపీ కేంద్రమంత్రి మురళీధరన్ సబ్ జైల్ కు వెళ్లడం విస్మయానికి గురిచేసిందని హోంమంత్రి సుచరిత అన్నారు. కేంద్ర మంత్రి మురళీధరన్ ఆత్మకూరులో జరిగిన సంఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకొని ఉంటే బాగుండేదన్నారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని.. మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. గొడవకు ప్రధాన కారకుడు అయ్యాడని పోలీసుల విచారణలో తేలినట్లు హోంమంత్రి సుచరిత గుర్తుచేశారు.…