Malla Reddy: మాట వరుసకు మాట్లాడిన మాటను పట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. బోడుప్పల్ లో నేను ఈటల రాజేందర్ ఎదురుపడ్డామని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కాకరేపుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన ఆయన.. ఈసారి బీజేపీ మాల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విషయంలో సానుకూలంగా మాట్లాడారు.
రాముల వారి పై ఒట్టేసి ఇచ్చిన హామీలు.. ఏ ఏడాది ఆగస్టున నెరవేస్తారో చెప్పాలని మాజీ ఎంపీ కవిత కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటల కే గ్యారెంటీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మానుకోట సభ దానికి నిదర్శనమన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు.. కాబట్టి మీ సభలకు దిక్కు దివాన లేదన్నారు.