Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బరితెగించి ముందుకు పోతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ భవనంలో ప్రెస్ మీట్లో అధికారుల పట్ల వ్యాఖ్యలు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశామని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణ చేస్తున్నారని…
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ బీ. మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ చెప్పినంత మాత్రాన మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లా?” అని ప్రశ్నించారు. ప్రజలు తమ వెంటే ఉన్నప్పుడు, కాంగ్రెస్ బలంగా కొనసాగుతున్న సమయంలో, గ్రాఫ్ తగ్గిపోతుందన్న అభిప్రాయం అసత్యమని ఖండించారు. ఫామ్ హౌజ్లో కూర్చొని పెన్ను, పేపర్ తీసుకుని గ్రాఫ్ గీస్తే, కాంగ్రెస్…
Gandra Venkata Ramana: భూపాలపల్లి హత్య కేసుపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి స్పందించారు. నిన్న భూపాలపల్లిలో జరిగిన హత్యను తాము ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కేసును వివాదాస్పదం చేయాలని కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు వెనుక భూవివాదమే ప్రధాన కారణమని అందరూ చెబుతున్నారని, హత్య చేసిన వారు కూడా అంగీకరించారని తెలిసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గండ్ర…
Harish Rao: నాగార్జునసాగర్ నీటి విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకపడ్డారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ నుండి గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్కు కుడి కాలువ ద్వారా 10,000 క్యూసెక్కుల నీరు తరలించబడుతోంది. రోజూ సుమారు రెండు టీఎంసీల నీరు ఏపీకి చేరుతోంది. ఈ తరలింపును ఆపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు…
కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు చాలా విస్తృతంగా సమావేశం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈ రోజు చాలా విస్తృతంగా, సుదీర్ఘంగా సమావేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మా పార్టీ ముఖ్యులు 30 మంది మాట్లాడారు. తెలంగాణకు ఏనాటికైనా బీఆర్ఎస్సే రక్షణ…
ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావు నిందితుడిగా చేర్చారు. రియాల్టర్ చక్రధర ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు…
కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… " కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఐదు ఏండ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీకు ఉనికి లేదు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్ లు ఇస్తున్నారు.
నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు. "సిల్వర్ జూబ్లీ వేడుకలే ఇంపార్టెంట్. ఈ సీఎం ఇంతలా ప్రజల్లో వ్యతిరేకత ఇంత తొందరగా వస్తుందనుకోలేదు.
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. కమిటీలకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోగానే పార్టీ శ్రేణులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కేడర్ తోపులాటతో అసహనానికి గురైన కేసీఆర్ ఒర్లకండిరా బాబు.. దండం పెడతానంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరుగనున్నది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. Also Read:PVR INOX: సినిమా ముందు యాడ్స్…