KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) తెలంగాణ భవన్లో జరుగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి నగరానికి బయల్దేరారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి “తాను కొడితే మామూలుగా ఉండబోదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి బీఆర్ఎస్ మరోసారి ముమ్మరంగా కార్యాచరణ సిద్ధం…
KCR: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తీసుకునేలా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడు (ఫిబ్రవరి 19) జరగనుంది. ఈ సమావేశానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అధ్యక్షతన వహించనున్నారు. గత ఆరు నెలలుగా తెలంగాణ భవన్‌కు రాకపోయిన కేసీఆర్, నేడు భవన్‌కు రానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ నేతృత్వంలో…
జనగామ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రా వాళ్ళను తిట్టి సీఎం అయితే.. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని తిట్టి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది.. వందల మంది ప్రాణాల త్యాగం లేదా..? అని ప్రశ్నించారు. రాజకీయంగా దెబ్బతింటాం అని తెలిసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర వాళ్లకు ఉందని అన్నారు.
శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ రైతు దీక్షపై కౌంటర్ ఎటాక్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతు దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.
Supreme Court: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమ పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో, ఈ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పీకర్…
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. దేవాదాయ, ఉమ్మడి జిల్లాలోనే ఆయన కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టు సాగింది. మంత్రి పదవే కాదు...ఏ ఎన్నికలు వచ్చినా...పార్టీ ఏది చెప్పినా ఆయనే ముందు వరుసలో ఉండేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పార్టీ మారేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు...ఇంద్రకరణ్ రెడ్డి…
తెలంగాణలో ఈ నెల 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు.అభ్యర్థులను పెట్టే దమ్ములేదని అన్నారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు. అబ్దుల్ కలాంను అవమానించిన అమెరికా స్థాయి నుంచి మోడీని గౌరవించిన…
GHMC : స్టాండింగ్ కమిటీ ఎన్నిక నామినేషన్ దాఖలుకు గడువు పూర్తయింది. ఈ నెల 10 వ తేదీ నుండి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలుకు అవకాశం కల్పించారు రిటర్నింగ్ అధికారి.. గడువు పూర్తయ్యే సమయానికి స్టాండింగ్ కమిటీ ఎన్నికకు మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుండి ఏడు నామినేషన్లు దాఖలు కాగా.. ఎంఐఎం నుండి 8 ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుండి 2 నామినేషన్లు దాఖలైనట్లు…