హిందీ పేపర్ ను పోటో తీసిన అతనికి బీజేపీ కి ఉన్న సంబందం ఏందని, పరీక్ష కేంద్రం వద్ద ఒక పోలీస్ కూడా లేడా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ పదో తరగతి పేపర్ లీకేజీ కేసు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెడకు చుట్టుకుంది. 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అని మంత్రి హరీశ్ రావ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా రామయంపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం రామయంపేటలో KCR కాలనీ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్ రూంలను మంత్రి ప్రారంభించారు.
భాద్యతగల ఎంపీగా ఉండి బండిసంజయ్ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వక పోవడం నేరమే అని కీలక వ్యాఖ్యలు చేశారు నర్సం పేట శాసన సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. రాష్ట్రం లో పరీక్షల లీకేజీ వ్యవహారం లో బీజేపీ కుట్ర కోణం ఉందని మేము వ్యక్తం చేసిన అనుమానాలు నిజమయ్యాయని అన్నారు.