బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నిలువరించాలనేది మా ప్రధాన ఎజెండా అన్నారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ఇప్పటికే పోడు భూములకు పట్టాలు,సింగరేణి సంస్థ ను కాపాడాలని డిమాండ్ చేస్తూ రెండు లేఖలు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు.
కరీంనగర్ జైల్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల అయ్యారు. సంజయ్ విడుదల నేపథ్యంలో జైల్ వద్ద ప్రదర్శనలు, ర్యాలీ లేకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
పిచ్చోడి చేతిలో రాయి... అది కేటీఆర్ కే వర్తిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు DK అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC లీకేజీ లో ఏ ఒక్క మంత్రి కూడా నోరు విప్పలేదని మండిపడ్డారు.