కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలపై మొరపెట్టుకుంటున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లే ముందు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు సీఎం కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి షెడ్యూల్ను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అవినీతిని నేను ఒప్పుకోను.. అవినీతి పరుల పట్ల కఠినంగా వ్యవహరిద్దామా? వద్దా? అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రియమైన సోదర సోదరీ మణులారా.. మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
బొగ్గు బావులను ప్రయివేటు పరం చేస్తే ఊరుకోబోమని, కేంద్రంపై జంగ్సైరన్ మోగిస్తామని సింగరేణి కార్మికులు భగ్గుమంటున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పిన ప్రధాని మోడీ... కేంద్ర ప్రభుత్వానికి హటావో సింగరేణి బచావో నినాదం వినిపించేలా మహాధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.