Perni Nani vs KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.. అయితే, ఇది మా వళ్లే సాధ్యం అయ్యిందంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది మన సీఎం కేసీఆరే నన్న ఆయన.. మేం తెగించి కొట్లాడాం.. కాబట్టే కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన చేసింది.. తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై వెనక్కి తగ్గిందని.. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుంది మరి అని వ్యాఖ్యానించారు..…
తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ఆయన దేశ వ్యాప్తంగా 71 వేల మందికి ప్రధాని మోడీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారని తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్న సందర్భంగా అంబేద్కర్ మద్దతుదారులు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి తరలిరానున్నారు.
నూతన సచివాలయం సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.
Off The Record: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గడిచిన…వరుసగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రోజు.. ఒక్కో సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములపై ఆయన ప్రశ్నిస్తున్నారు. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధికి కేటాయించిన భూముల వ్యవహారంలో ఐదు వేల కోట్ల ప్రజాధనం ప్రభుత్వానికి రాకుండా పోయిందని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన జీవోనే… తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ…భూములు కేటాయిస్తున్నారని విమర్శించారు. దీనికి కొనసాగింపుగా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో యశోద ఆసుపత్రి యాజమాన్యానికి కేటాయించిన భూముల…
Off The Record: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా పట్టున్న నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అలాంటి నేతకు బిఆర్ఎస్తో సంబంధాలు తెగిపోయాయ్. ఇప్పుడు ఆయన ఏ పార్టీ వైపు వెళతాడన్నది ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్ల నుంచి బిఆర్ఎస్ అధిష్టానంపై మాజీ ఎంపి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో…పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ…2019 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ సీటు ఇవ్వలేదు. అప్పటి నుంచి పొంగులేటిని పార్టీ అధినేత కేసిఆర్ దగ్గరకు రానివ్వడం లేదన్నది జనమెరిగిన…
Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఎవరని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. వాళ్ల రాష్ట్రం గురించి వాళ్లు చూసుకుంటే మంచిదన్నారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్లు.. జాగ్రత్తగా మాట్లాడాలన్నారు బొత్స. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఎవరు ఏం మాట్లాడారో తమకు తెలుసన్నారు. ఆంధ్ర వాళ్లు తెలంగాణలో ఉండాలనుకుంటారో? తెలంగాణ వాళ్లు అమెరికాలో ఉండాలని అనుకుంటున్నారో? అందరికీ తెలుసన్నారు బొత్స. రాజకీయం కోసం హరీష్ రావు మాట్లాడతాడు.. ఎవరో ఏదో…
Karepally : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి(Karepally), చీమలపాడు ప్రమాద ఘటనపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. దీంతో.. ఏపీ మంత్రులు కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. ఇక, వారి వ్యాఖ్యలపై మరోసారి అదేస్థాయిలో స్పందించారు మంత్రి హరీష్‌రావు.. సంగారెడ్డి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని సవాల్ చేశారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది.. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉంది..…