50 ఏళ్లు అధికారంలో ఉన్న తనకు అవకాశం ఇస్తే ఎలా చేస్తారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
సీఎంతో నేను డిమాండ్ చేసిన తర్వాత ఒక దళిత అధికారిని నియమించారని బీజేపీ శాసన సభ్యులు ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు అన్నారు. భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకోవటం సంతోషమన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాదయాత్ర శిబిరం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాలవేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లాలో పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టమన్నారు.
అక్కడ పనులు ఆగిపోతే పనులు ప్రారంభించాలని బీజేపీ వార్నింగ్ ఇస్తేనే ఈ రోజు విగ్రహం పూర్తి అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.