MLA Rekha Naik: నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ చౌరస్తాలో ధర్నా చేస్తా అని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ పై మండిపడ్డారు. రూ. 2.25 కోట్ల ACDP నిధులు ఆపి.. నన్ను అణగతొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నా నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ NTR చౌరస్తాలో ధర్నా చేస్తా అని హెచ్చరించారు. పోలీస్ అధికారులు నా దగ్గర ఉన్న SB కానిస్టేబుళ్లను కూడా తీయడం సరికాదని మండిపడ్డారు. ఖానాపూర్ లో మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు కావడానికి నేను ఎంతో కృషి చేశానని తెలిపారు. వాళ్ళకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. నియోజికవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిపెడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను రెబల్ గానైనా, ఇండిపెండెంట్ గా నైనా తప్పక పోటీలో ఉంటానని అన్నారు. అభివృద్ధి నేను చేస్తే గొప్పలు వారు చెప్పుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరితంగ అభివృద్ధి పనులను ఆపివేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు సరైన టైంకు గుణపాఠం చెప్తారని అన్నారు.
Read also: Tiger Shroff: బాలయ్య… విజయ్… రవితేజ… శివన్నలకి పోటీ టైగర్ వస్తుంది
ఇక తాజాగా.. ఏసీడీపీ నిధులు ఆపారు.. అభివృద్ది ఆపడం ఏంటీ అంటూ ఆమె ప్రశ్నించిన విషయం తెలిసిందే. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రోడ్ల పనులు ఆపారు.. నిధులు రాకుండా నిలిపి వేశారు అని ఎమ్మెల్యే అడిగారు. నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను.. పార్టీ మారలేదు.. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని రేఖానాయక్ తెలిపారు. ప్రజలకు అభివృద్ది కావాలి.. నేను నిధులు అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు.. నేను పార్టీ మారలేదు రేఖా నాయక్ తెలిపారు. పార్టీ మారింది నా భర్త.. నేను కాదు అని ఆమె అన్నారు. కావాలనే తన అల్లుడు ఐపీఎస్ బదిలీపై స్పందిస్తూ ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు చేసిన అన్యాయం చాలదన్నట్లు నా బిడ్డకు అన్యాయం చేసారు అంటూ కార్యకర్తల దగ్గర బోరున రేఖా నాయక్ విలపించారు. నా భర్త కాంగ్రెస్ లోకి వెళ్లారు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారి తండ్రి సీపీఐ పార్టీలో పనిచేయడం లేదా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పని చేశాను.. నియోజకవర్గం కోసం పని చేశాను.. 9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను.. అభ్యర్థి కోసం అభివృద్దిని ఆపడం ఏంటీ అని ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అడిగారు. ఇది మంచి పద్దతి కాదు.. ఇలాంటి దొరణి ఏదైనా ఉంటే ప్రభుత్వం వెంటనే దాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.
Balapur Ganesh: భారీ ఆకారంలో బాలాపూర్ గణేష్.. సాయంత్రం తొలిపూజ