Jagga Reddy: కాంగ్రెస్ కి 70 సీట్లు పక్కా అని.. నా మీద ఐటీ దాడులు చేస్తే వాళ్లే ఇచ్చి పోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెఎల్ఆర్ దగ్గర ఎమున్నాయ్ అని ఐటీ దాడులు చేస్తున్నారు అని ప్రశ్నించారు. నా మీద దాడి చేస్తే.. ఐటీ వాళ్లే ఇచ్చి పోవాలని.. ఐటీ వాళ్ళు వస్తే.. అప్పులు లెక్క పెట్టి… డబ్బులు ఇచ్చి పోవాలని వ్యంగాస్త్రం వేశారు. తెలంగాణలో ప్రజలు అంతా కాంగ్రెస్ తో ఉన్నారని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ కి 70 సీట్లు వస్తాయన్నారు. సింగిల్ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎంఐఎం సినిమా హైదరాబాద్ కె పరిమితమని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎం.. బీఆర్ఎస్ .. బీజేపీ ఒక్కటే అన్నారు. బీజేపీ ఆడుతున్న అటలో బీఆర్ఎస్, ఎంఐఎం పావులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అర్థం చేసుకోండని తెలిపారు. బీజేపీ.. బీఆర్ఎస్.. కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని కుట్ర చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్.. కవిత ను జైల్ కి పంపిస్తా అన్నారు.. కవిత అరెస్ట్ సడన్ గా ఆగిపోయింది? అని ప్రశ్నించారు. కవిత అరెస్ట్ ఆగిపోగానే.. బీజేపీ వాళ్ళ ఆశలు గల్లంతు అయ్యాయని తెలిపారు. కిషన్ రెడ్డి అయితే సప్పుడు చెయ్యకుండా కూర్చుంటారు అని బీజేపీ కిషన్ రెడ్డి కి ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీ గెలిచే దమ్ము లేదు కాబట్టి.. బీఆర్ఎస్ ని అడ్డం పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్ అపి..బీఆర్ఎస్ ని పెంచే పనిలో పడింది బీజేపీ అని ఆరోపించారు. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కి రాకుండా ఉండేందుకు.. ఎంఐఎం బీజేపీ కి సైనికుడిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంఐఎం 7 ఎమ్మెల్యేలను పాతబస్తీ లో ఓడించండి.. మీ బతుకులు మార్చేస్తుంది కాంగ్రెస్ ఉందన్నారు. కాంగ్రెస్ తరపున మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా? అని హామీ ఇచ్చారు. దారూసలం ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అన్నారు. రేవంత్.. కొడంగల్.. కామారెడ్డి లో పోటీ చేస్తున్నాడు.. . నన్ను కూడా ఎక్కడైనా పోటీ చెయ్ అంటే పోటీకి నేను కూడా సిద్ధం మని క్లారిటీ ఇచ్చారు. జగ్గారెడ్డి భయపడే వాడా..? హరీష్ వంద పంచులు వేసినా.. నేను ఒక్కటే వేస్తే చాలు అని అన్నారు. సంగారెడ్డి లో పేదలకు 100 గజాలు స్థలం ఇంటి జాగా ఇవ్వాలని నా కోరిక అన్నారు.
రైతులకు డబ్బులు ఇచ్చి 2000 ఎకరాలు తీసుకుని ఇంటి జాగా ఇస్తా అన్నారు. నాకు మా ఇంట్లో నా బిడ్డే ప్రత్యర్థి అన్నారు. నేను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నా బిడ్డనే నిలదిస్తది అన్నారు. రేవంత్.. నేను అన్నదమ్ముల లాంటి వాళ్ళం అన్నారు. చిన్న సమస్యలు వస్తాయి.. అయిపోయింది పంచాయితీ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని.. ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. సీక్రెట్..సైలెంట్ ఓటింగ్ ఐతదన్నారు. సునామీ వస్తుంది..70 సీట్లు వస్తాయని క్లారిటీ ఇచ్చారు. 57 ఏండ్ల వళ్లకు పెన్షన్ ఇస్తా అన్నావు.. ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్