Raj Gopal Reddy: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడర్ కాదు,ఒక బ్రోకర్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బచ్చన్నపేటలో రోడ్ షో,కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతంర మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది,పార్టీ సచ్చిపోయిందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడర్ కాదు,ఒక బ్రోకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళ్ళు పట్టుకొని, మందు, సోడా పోసి సిట్టింగ్ కాండిడేట్ నీ కాదని టికెట్ తెచ్చుకున్నాడన్నారు. పల్లా అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు సృష్టించి గెలిచాడన్నారు. జనగామ ప్రజలు ఒక ఆర్థిక ఉగ్రవాదిని గెల్పించారన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టులో దర్యాప్తు జరగుతుందన్నారు.
Read also: Pushpa2 : వివాదాల నడుమ జనసేన గుర్తుతో అల్లు అర్జున్ ప్రచారం?
కోర్టులో రుజువు అయితే పల్లా, హరీష్ రావు తో పాటు 30 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందన్నారు. అప్పుడు జనగామకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నే ఎమ్మెల్యే అంటూ క్లారిటీ ఇచ్చారు. పల్లాను 6 నెలల్లో గద్దె దించుతామన్నారు. బీఆర్ఎస్ చేసిన అవినీతి పాపాల చిట్టా బయటకి తీస్తామన్నారు. లిక్కర్ స్కాంలో కవిత జైలులో ఉంది, ఈసారి బతుకమ్మ జైలులోనే ఆడుతుందన్నారు. కాళేశ్వరం కుంభకోణం బయట పడితే ఒకరు చర్లపల్లి,మరకోరు చెంచల్ గూడ, కేసీఆర్ అండమాన్ నికోబార్ జైలుకే అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులు పాలు చేశారన్నారు. బిడ్డ జైలుకు పోతే బిడ్డ దగ్గరకు పోలేదన్నారు. కేసీఆర్ కు బిడ్డ మీద లేని ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా కేసీఆర్ బస్సులో తిరుగుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Delhi High Court : రూ.5 లక్షల కోట్ల విలువైన హెరాయిన్ మాయం.. కేంద్రానికి హైకోర్టు అక్షింతలు