తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంతాపం వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కేటీఆర్ అన్నాడు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Manipur Violence: మిజోరానికి 12వేల మంది మణిపూర్ వాసులు.. కేంద్రాన్ని రూ.10కోట్లు కోరిన ప్రభుత్వం
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ఆయన తెలిపారు. సాయి చంద్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రార్థించారు.
Read Also: Tomato: 3వారాల్లో 700శాతం పెరిగిన టమాటా ధరలు.. రాకెట్ వేగంతో పెరగడానికి కారణం ఏంటి?
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణవార్త తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్దిస్తున్నాని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు .
Read Also: Assam Floods: అస్సాం వరదల్లో 7గురు మృతి.. 12 జిల్లాల్లో స్తంభించిన జనజీవనం
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవిగాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మరణవార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. సాయి చంద్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.. సాయిచంద్ స్వరం తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచింది. మంచి భవిష్యత్తు ఉన్న సాయిచంద్ మరణం తెలంగాణకు తీరని లోటు అని ఆయన తెలిపారు. సాయిచంద్ చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుతున్నాను అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Read Also: CM KCR: సాయి చంద్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువ గాయకుడు, కళాకారుడి గొంతు అకాలంగా మూగ పోయిందని.. సాయిచంద్ అకాల మరణం తనను కలిచి వేసిందని వినోద్ కుమార్ అన్నారు. సాయి చంద్ కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.