వికారాబాద్ జిల్లా పరిగి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధుతో ఎంతో మంది దళితులు బాగుపడ్డారని, ప్రతి సంవత్సరం లబ్ధిదారులకు దళిత బంధు విడతలవారీగా వస్తుందన్నారు. దళితులకు ఒకసారి రిజర్వేషన్ కల్పించాలని, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు పెద్దపెద్ద ఉద్యోగాలు సంపాదించిన వాళ్లకు రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ ఎంత అభివృద్ధి చెందుతుందో దేశాన్ని కూడా అంతే అభివృద్ధి చేయాలని అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్ అనే నినాదంతో బీర్‌ఎస్ పేరులో దేశం వైపు వెళ్తున్నారు దేశాన్ని అభివృద్ధి చేయడమే కేసీఆర్ లక్ష్యమని ఆయన వెల్లడించారు. తెలంగాణలో రైతుని రాజు చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ లేదు మీకు డబ్బులు ఇవ్వం తెలంగాణ వెనుకబడింది కేసీఆర్ వేస్ట్ అంటుండ్రు బీజేపీ వాళ్లు.. తెలంగాణ ముఖ్యమంత్రి వేస్ట్ అయితే అవార్డులు ఎందుకిస్తారు తెలంగాణ గురించి అంత గొప్పగా దేశం ఎందుకు చెప్పుకుంటుందని ఆయన ప్రశ్నించారు.
Also Read : Jagananna Vasathi Deevena: శుభవార్త చెప్పిన సీఎం జగన్.. రేపే వారి ఖాతాల్లో నిధుల జమ
తెలంగాణలో వ్యవసాయం నుంచి మొదలుకొని ఐటీ సెక్టార్ వరకు దేశంలోనే ముందుందని, బీజాపూర్ హైదరాబాద్ నేషనల్ హైవే ఐదు సంవత్సరాల నుంచి భూ సేకరణ చేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వనికి చేతన కావడం లేదు అని బీజేపీ నాయకులు మొన్న సభలో అంటున్నారన్నారు. ఐదు సంవత్సరాల నుంచి బీజాపూర్ నేషనల్ హైవే వెనుకబడింతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నేషనల్ హైవే ను మంజూరు చేయించానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 39 వేల కోట్లు రోడ్డు సెస్తు కట్టింది కేంద్రం చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. రోడ్డు విస్తరణ 45 మీటర్లకు తగ్గించింది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 60 మీటర్లు పొడిగించేందుకు కృషి చేశానన్నారు. నేషనల్ హైవే భూ సేకరణ 73 శాతం అయిపోయింది ఒక్క 22 గ్రామాలు భూమి ఇవ్వడానికి వెనుకకు జరుగుతున్నారు కలెక్టర్ తో సంప్రదింపులు చేసి రైతులతో మాట్లాడి భూసేకరణ పూర్తి చేస్తాం ఎంపీ రంజిత్ రెడ్డి వెల్లడించారు. వికారాబాద్ జిల్లాకు సాగునీరు ఉదండాపూర్ వరకు వచ్చింది, 5180 కోట్లు మిగతా టెండర్ కు శాంక్షన్ అయింది పరిగి ప్రాంతానికి ఒక లక్ష 30 వేల ఎకరాలకు సాగునీరు రానుంది, అలాగే తాండూర్ కోడంగల్ వికారాబాద్ నియోజకవర్గాలకు కూడా సాగునీరు అతి తొందరలో వస్తుందని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు.
Also Read : Harish Rao : బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టి రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నారు