బీజేపీ నేతల పై ఎమ్మెల్యే జోగు రామన్న ఫైర్ అయ్యారు. మా సొమ్ము అయితే మీది సోకులు అంటూ సెటైర్ వేశారు. ఢిల్లీ లో ఏక్ నంబర్ బామ్టే ఆదిలాబాద్ లో సాత్ నంబర్ బామ్టే లున్నారన్నారు. అప్పులు చేసి అయినా మేము అభివృద్ధి పనులు చేశాము.. మీరు చేశారా? అంటూ ప్రశ్నించారు.
అసంతృప్త…అసమ్మతి నేతల అంశాన్ని బీఆర్ఎస్ ఏం చేయనుంది ? అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో…ఆ నేతలను గులాబీ పార్టీ బుజ్జగిస్తుందా ? అవసరం లేదనుకుని లైట్ తీసుకుంటుందా ? ఈ నేతల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై…టిఆర్ఎస్ పెద్దలు వెయిట్ చేస్తున్నారా ? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు…షెడ్యులు ప్రకారం ఈ ఏడాది చివరిలో జరగనున్నాయ్. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలో…అప్పడే అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యేలు నియెజకవర్గాల్లో…
ఢిల్లీలో అతిథులకు చాయ్ ఇస్తున్న మంత్రి మల్లా రెడ్డి వీడియో వైరల్ అవుతుంది. ఢిల్లీలో బీఆర్‌ఎస్ భవన్ వద్దకు వచ్చిన నాయకులకు మంత్రి మల్లారెడ్డి పలకరించి, నాయకులకు చాయ్ కప్పులు పట్టుకుని ఉంటే వారికి తన దగ్గర వున్న మగ్గులో నిండా చాయ్ వుంది. దానిని పార్టీ నాయకులకు కప్పులో వేస్తుండటం. వారు ఆనందంగా తీసుకుని చాయ్ తాగడం ఆశక్తి నెలకొంది.
యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం దేవలమ్మ నాగారంలో R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మునుగోడు ఎన్నికలు కేవలం కాంట్రాక్టు కోసం వచ్చాయి తప్ప అభివృద్ధి కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.