బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినేట్‌లో బ్రిటిష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌కు చోటు కల్పించారు. తన కేబినేట్ పున:వ్యవస్థీకరలో భాగంగా కామెరూన్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించారు.
గత వారంలో మూడు రోజుల పాటు ఢిల్లీ, ముంబైలో గల బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ సర్వే కార్యకలాపాల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం పార్లమెంట్‌లో బీబీసీని, దాని సంపాదకీయ స్వేచ్ఛను గట్టిగా సమర్థించింది.
కొవిడ్ మహమ్మారి దెబ్బకు బ్రిటన్ విలవిల్లాడుతోంది. ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు…ఆ దేశాన్ని హడలెత్తిస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో అక్కడ లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్‌లో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. బ్రిటన్‌లో 24 గంటల వ్యవధిలో లక్షా 6వేల 122 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ బాధితుల…