బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 ఆదివారం కొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం పాలించిన వారి జాబితాలో థాయ్‌లాండ్ మాజీ పాలకుడు భూమిబల్ అతుల్యతేజ్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. భూమిబల్ 1927 నుంచి 2016 మధ్య 70 ఏళ్ల 126 రోజులు రాజుగా ఉన్నారు. 25 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిరోహించిన ఎలిజబెత్.. ఇంకో రెండేళ్లు పదవిలో కొనసాగితే ఫ్రాన్స్ లూయి–14ని కూడా దాటేసి తొలి స్థానంలో నిలుస్తారు. లూయి–14 1643 నుంచి 1715 దాకా…