తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సభలో విద్యుత్ రంగంపై స్పల్పకాలిక చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ మాత్రమే పూర్తి చేసింది.. రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో 81 వేల 516 కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు.…