మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ముహూర్త సమయానికి కరెంట్ పోవడంతో, పీటలపై ఉన్న వరుడు మారిపోయాడు. పెళ్ళి కూడా జరిగిపోయింది. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే.. అసలు విషయం బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయిన్‌కి చెందిన రమేశ్‌కు నిఖిత, కరిష్మా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ ఒకేసారి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్న రమేశ్.. వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో తన కూతుళ్ళ పెళ్ళిని నిశ్చయించాడు. ఎట్టకేలకు పెళ్ళి…