UP: ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్తగా పెళ్లయిన వ్యక్తికి ‘‘ఫస్ట్ నైట్’’లో షాక్ తగిలింది. కొత్త పెళ్లికూతురు తొలి రాత్రి బీరు, గంజాయి, మేక మాంసం కోరడంతో ఈ విషయం పోలీస్ స్టేషన్‌కి చేరింది. తొలి రాత్రి ‘‘ ముహ్ దిఖాయ్’’ ఆచారంలో వధువు బీరు కావాలని కోరింది. దీంతో భర్త ఒకింత ఆశ్చర్యపోయినప్పటికీ, ఆమె బీరు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఆ తర్వాత గంజాయి, మేక మాంసం అడగడంతో షాక్ అయ్యాడు.