ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై చర్చించారు. భేటీలో చర్చించిన అంశాలను కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చించామన్నారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని కీలక అంశాలను…
చేనేత కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శనివారం హామీ ఇచ్చారు. సిరిసిల్లలో పవర్లూమ్ రంగ సమస్యలపై చర్చించేందుకు పవర్లూమ్ యూనిట్ల యజమానులు, మాస్టర్ వీవర్లు, కార్మికులతో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జౌళి పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, కార్మికుల ఉపాధి, భవిష్యత్తు కార్యాచరణపై కలెక్టర్ చర్చించారు. చర్య. వారితో ఇంటరాక్ట్ చేస్తూ కాటన్, పాలిస్టర్,…
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశం 7.45 నిమిషాలకు ముగిసింది. సమావేశం 1.45 నిమిషాల పాటు సాగింది.…
భువనగిరి ఎంపి ఎన్నికలలో బిజేపి 32 శాతం ఓట్లు తెచ్చుకుందని, పార్లమెంట్ ఎన్నికలలో బిజేపి గెలిస్తే రాజ్యాంగం మారుస్తారని అసత్యప్రచారాలతో ప్రజలను నమ్మించారన్నారు మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన జనగామ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచి మంత్రులు పర్యటన పేరుతో కాలయాపన చేస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు.…
కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పాంచ్ న్యాయ పేరుతో చెప్పింది ఎంటి… ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని, 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారు… వారితో రాజీనామా చేయిస్తే ఆ 26 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందన్నారు బండి సంజయ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ అన్నారు. రెండు రాష్ట్రాలకు మంచి జరగాలని, కొందరు గోతి కాడి నక్కల్ల ఎదురు…
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 51 వేల కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది PR&RD. అయితే.. గత బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి…
సంగారెడ్డిలోని అమీన్పూర్లో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఏఐ ఆధారిత ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్ 50,000 ఉద్యోగాల కల్పనకు సిద్ధమైంది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న పల్సస్ గ్రూప్ నేతృత్వంలోని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, ఆరోగ్య సంరక్షణ , IT ల్యాండ్‌స్కేప్‌ను గణనీయంగా ప్రభావితం చేయడం, గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫార్మాసిస్ట్‌ల వార్షిక కార్యక్రమం 73వ ఐపిసి కాంగ్రెస్‌లో పల్సస్ గ్రూప్ సిఇఒ , మేనేజింగ్ డైరెక్టర్…
మేడిగడ్డ బ్యారేజీ వద్ద పేరుకుపోయిన ఇసుక మేటల వేలానికి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఎండీసీఎల్) బిడ్లను ఆహ్వానించడంతో 383 బిడ్లు వచ్చాయి. 14 బ్లాకుల వేలానికి ఈ బిడ్లు వచ్చాయి. ఈ ఇసుక బ్లాక్‌లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల పరిధిలో ఉన్నాయి. బిడ్లను పరిశీలించేందుకు టీజీఎండీసీఎల్ నుంచి ఐదుగురు అధికారులతో పాటు మైనింగ్, ఇరిగేషన్ శాఖల నుంచి ఒక్కొక్కరితో కమిటీని ఏర్పాటు చేసినట్లు వర్గాల సమాచారం. బిడ్డర్ల సాంకేతిక అర్హతల పరిశీలన…
తెలుగు రాష్ట్రాల సీఎం ల భేటీ పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ అవడం మంచి పరిణామమేనని, విభజన సమస్యలు పరిష్కారం చేసుకోవాలన్నారు ఈటల రాజేందర్. ఉద్యోగుల విభజన అంశం ఇంకా కొలిక్కి రాలేదని, రెండు రాష్ట్రాల కు అవసరం అయ్యే విదంగా చర్చలు జరిగాలన్నారు ఈటల. మేము ఉద్యమ సమయంలో కూడా ఇదే విషయం చెప్పామన్నారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య చోటుచేసుకున్న…
ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. తిరుమల దర్శనం వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రులు భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కోరాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖలో పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి…