నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండకు చేరుకుంటారు. వారికి బైక్ ర్యాలీలతో టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకనున్నారు. ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ,ఎస్టీ హాస్టల్ ప్రారంభం. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ…
రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఇద్దరు మైనర్ అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీగా మారింది. వేరు వేరు ప్రాంతాలలో ఇద్దరు విద్యార్థినీలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే టైలరింగ్ నేర్చుకోవడానికి ఓ విద్యార్ధిని వెళ్లగా స్కూల్ కు మరో విద్యార్ధిని వెళ్లింది. అయితే ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన విద్యార్థినీలు సాయంత్రం ఎంతకీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టూ పక్కల వెతికి, సమీప బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా ఫలితం లేకపోయింది.…
తూర్పుగోదావరి జిల్లా కడియంలో రెండు తలలతో గేదెదూడ జన్మించింది. అనంతరం 1 గంటలోపే మరణించిన సంఘటన మండలంలోని మురమండ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పాడిరైతు తూలూరి వీరకాసు మకాంలో నిన్న రాత్రి ముర్రా జాతి గేదెకు రెండు తలల లేగదూడ జన్మించింది. ఈ వార్త ఆ నోటా ఈ నోటా గ్రామమంతా వ్యాపించింది. గ్రామ ప్రజలు లేగదూడను చూసేందుకు ఎగబడ్డారు. ఇంతలోనే ఆ దూడ మరణించడంతో నిరుత్సాహపడ్డారు. జన్యులోపంతో బహు అరుదుగా ఇలాంటి లేగదూడలు జన్మిస్తాయని…
కరోనా మహమ్మారి విజృంభన మరోసారి కొనసాగుతోంది. కరోనా డెల్టా వేరియంట్‌కు తోడు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ సైతం దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. అయితే గత 24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 18.16 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికాలో 5.37 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో అమెరికాలో 1300 మందికిపైగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌లో సైతం…
గత నెల క్రితం వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై, కాంచీపురం తిరువళ్లూరు, చింగ్లెపేట్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో చైన్నైలో ఫ్లడ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను సీఎం స్టాలిన్…
ఇటీవల తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసింది. అయితే ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే ఢిల్లీలో దాదాపు 4 రోజుల పాటు ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కలకలం రేగింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా…
ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే తెలంగాణలోకి కూడా ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ అనుకున్నదానికంటే శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన స్పష్టం…
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని, వచ్చే రెండు నుంచి నాలుగు వారాల దేశానికే కాదు రాష్ట్రానికీ ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని…
ఫీవర్ హాస్పిటల్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్కి ఈ రోజు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు కాలేరు వెంకేటేశ్, ముఠా గోపాల్ సహా పలువరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 68 కోట్ల రూపాయలతో కవాడిగూడ బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసే వరకు నాలాకు రక్షణగోడ నిర్మాణం చేపడుతున్నామన్నారు. గతంలో కురిసిన వర్షాల వలన ప్రజలను బాగా ఇబ్బంది పడ్డారని, అప్పుడు…
హైదరాబాద్ లోని ఫీవర్ హాస్పిటల్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్ కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ సహా పలువురు పాల్గొన్నారు. 68 కోట్ల రూపాయలతో కవాడిగూడ బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసే వరకు నాలాకు రక్షణగోడ నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.