ఉద్యోగ బదీలీల అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా ఆయన దీక్ష చేపట్టారంటూ నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్ని ఆయన అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, బండి సంజయ్ కార్యాలయంలోకి బలవంతంగా వెళ్లి…
ఏపీలో రైతులను వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యులు కళావెంకటరావు అన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో రైతులు 80 శాతం వరి పంట పై ఆధారపడ్డవారున్నారన్నారు. ఈరోజు రైతులు లబోదిబోమంటున్నాని ఆయన అన్నారు. పండగ చేసుకునే పరిస్దితి లేదని, ఎప్పుడైనా రైతుకళ్ళల్లో కన్నీరు వస్తుంటుంది, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల కళ్ళలో రక్తం వస్తుందని ఆయన విమర్శించారు. ఐదేళ్ల క్రిందట వరి పంట…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటి కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ప్రధాని మోడీతో సీఎం జగన్ పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి సీఎం జగన్ వినతిప్రతం అందజేయనున్నారు. అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్ట్, జల వివాదాలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు.…
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. తాజా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దుర్మార్గమైన పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కేంద్ర నిధులిస్తుంటే జగన్ తన సొంత పథకాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఆదాయ వనరుగా చేసుకొని జగన్ దోచుకుంటున్నారన్నారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదని ఆయన హితవు పలికారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ తరుఫున మండల…
కేంద్ర మంత్రులు నిర్మలాసీతారమన్, మహేంద్రనాథ్‌లకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేక రాశారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను కేంద్రం పునఃప్రారంభించాలని కోరుతూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. సీసీఐ యూనిట్ తెరిచేందుకు సానుకూల అంశాలున్నాయని ఆయన అన్నారు. దేశీయంగా సిమెంట్‌కు భారీ డిమాండ్ ఉందని, ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు లాభాలు అర్జిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే సీసీఐ తెరిచేందుకు రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కంపెనీ ప్రారంభిస్తామంటే కొత్త కంపెనీలకు ఇచ్చే ప్రోత్సహకాలు,…
ఏపీలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వంగవీటి రాధా రెక్కీ అంశంపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హత్యకు రెక్కీ ఆధారాలు ఉంటే రాధా బయట పెట్టాలని ఆయన అన్నారు. రెక్కీ ఎవరు చేయబోయారో రాధా బయటపెట్టాలి, రాజకీయ లబ్ది కోసం రాధా చంద్రబాబు చెప్పినట్టు చేయకూడదు ఆయన అన్నారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారని, చంద్రబాబు తప్పుడు…
ఛత్తీస్‌గఢ్‌లో మొన్నటికి మొన్న ఓ మాజీ ఉప సర్పంచ్‌ను మావోయిస్టులు హత్య చేసిన ఘటనను మరవకముందే మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మానసిక వికలాంగుడు పోలీస్ ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని అతడిని బీజాపూర్ జిల్లా బాసగూడలో హత్య చేశారు. అయితే గతంలోనూ మాజీ ఉప సర్పంచ్‌ను కూడా పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడనే నేపంతో ప్రజా కోర్టు శిక్షించినట్లు మావోయిస్టులు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఓ వికలాంగుడు పోలీసులకు మావోయిస్టుల సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణతో జన మిలీషియా సభ్యులు…
గత సంవత్సరం నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలుదేశాలకు వ్యాప్తి చెందింది. అయితే ఈ వేరియంట్ ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కరోనా డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అయితే డబ్ల్యూహెచ్‌వో చెప్పినదాని కంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 94 కొత్త ఒమిక్రాన్ కేసులు…
మరోసారి కరోనా రక్కిసి రెక్కలు చాస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత 15 రోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా సుమారు 7 వేల లోపు కరోనా కేసులు నమోదయ్యేవి. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా కేసులు రాగా, 284 మంది కరోనా బారినపడి మృతిచెందారు. గడిచిన 24…
యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి ప్రపంప దేశాలపై విరుచుకుపడుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ ప్రభావంతో కరోనా కేసులు కూడా భారీ పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 16.39 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా తాజాగా…