తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న అమిత్ షాకు 20 మంది బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కొత్తగా సీఎఫ్ఎస్ఎల్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ సైబర్…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి తల్లి కొడుకుల ఆత్మహత్య కేసులో నిందుతులకు బెయిల్ మంజురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొందరు వ్యక్తుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సంతోష్, అతడి తల్లి పద్మ కామారెడ్డిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 18 నెలలుగా 7గురు వ్యక్తులు తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పిన సంతోష్..వారి పేర్లను కూడా వెల్లడించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసును…
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు మరోసారి బీజేపీ నేతలపై, కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని నారాయణరావు పేట మండలం గుర్రాలగొంది గ్రామంలో లక్ష్మీనరసిహస్వామి విగ్రహా పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా ఆ దేవుడి ఆశీస్సులు తీసుకుంటారని, కాలేశ్వరం ప్రాజెక్టుకు కొందరు నాయకులు కోర్టుల్లో కేసులు వేసినా, దేవుని దయతో మూడున్నర సంవత్సరాలలో పూర్తి చేశామని ఆయన…
బాలీవుడ్ ఎంట్రీపై హీరో మహేష్ బాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. హిందీలో ఆఫర్లు ఉన్నప్పటికీ బాలీవుడ్ నిర్మాతలు తనను భరించలేరన్న ఆయన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సినీ రంగం నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తాజాగా నటి కంగనా రనౌత్ మహేశ్ బాబుకు మద్దతుగా మాట్లాడారు. మహేశ్ బాబు అన్నది నిజమే…ఆయనను బాలీవుడ్ భరించలేదని చెప్పింది. ఆయనకి తగిన రెమ్యునరేషన్‌ని బాలీవుడ్ ఇవ్వలేదని కూడా చెప్పింది. అంతేకాకుండా టాలీవుడ్‌ను చూసి చాలా…
సనత్ నగర్ బస్టాండ్ ఆనుకుని ప్రధాన రహదారిపై ఉన్న మెడికల్ స్టార్ లో తెల్లవారుజామున ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి వెళ్తూ తన దుస్తులు విప్పి దొంగ రెండు గంటల పాటు నగ్నంగానే అందులో ఉన్నాడు. తిరిగి బయటికొస్తూ దుస్తులు వేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన సనత్ నగర్ ఠాణా పరిధిలో జరిగింది. బాలాజీ ఫార్మాలోకి అర్ధరాత్రి ఓ దొంగ ప్రవేశించాడు. షట్టర్ తాళాలు విరగ్గొట్టి లోపలికి నగ్నంగా ప్రవేశించిన దొంగ…
హైదరాబాద్‌లో నేడు వెంగళ్రావునగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయా మున్సిపాలిటీల్లోని మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మున్సిపల్ అధికారులపై అరిస్తే.. గొప్ప అనుకునే వారికి కేటీఆర్ చురకలంటించారు. అధికారిక సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరిపి, సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళ్లాలని, చైర్మన్లు, మేయర్లను సుతిమెత్తగా మందలించారు. మన దేశంలో ఒక దురలవాటు ఉంది. కౌన్సిల్ సమావేశాలకు…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఇటీవల తనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా నిరూపించాలని.. బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్‌కి కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌పైన బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, బండి సంజయ్ చేసిన ఆరోపణలపైన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని,…
గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవనానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని, రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామని ఆయన వెల్లడించారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధికై…
బీజేపీపై మరోసారి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నామని, బీజేపీ బండి సంజయ్ ది ప్రజా సంగ్రామ యాత్ర కాదు అది.. అంతర్గత సంఘర్షణ యాత్ర అంటూ సెటైర్లు వేశారు. బండి సంజయ్ మాటలు చాలా ఆశ్చర్యం కల్గించాయని, విద్వేషాలు రెచ్చగొట్టే ఎజెండా బండి సంజయ్‌ది అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. విధానాలతో రాలేదు.. విద్వేషాలతో బండి…