విజయవాడ సింగ్నగర్ లో కొందరు వ్యాపారులు, ప్రైవేటు మోటార్ బోట్ నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు.. వాంబే కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, రాజరాజేశ్వరిపేట, పైపుల కాలనీ, వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల నుంచి బోట్ల సాయంతో సింగ్ నగర్ కు వచ్చే బాధితుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యాపారులు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలను సేకరించి శివారు కాలనీలకు తీసుకువెళ్ళి భారీ మొత్తలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.. ఆహార పదార్థాలను పంపిణీ…
గుంటూరు జిల్లా లోని ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండల పరిధి గ్రామాల్లో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు పదివేల ఎకరాల్లో వరి నీట మునిగిందని అధికారులు గుర్తించారు. పొన్నూరు ఏ.డి.ఎ రామకోటేశ్వరి తో పాటు మండల వ్యవసాయ శాఖఅధికారిని కె కిరణ్మయి నీటి ముంపుకు గురైన ప్రత్తి పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యమంలో లాం శాస్త్రవేత్తలు యం.నగేష్, ఎస్. ప్రతిభ శ్రీ, వి. మనోజ్ , డి. ఆర్ సి ఇన్చార్జి డి…
భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు గత రెండు రోజులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఆయన కాకుండా మంత్రులు సైతం అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఒక రూపాయి ఎక్కువైనా బాధితులకు ఆహారం మాత్రం కచ్చితంగా అందాలని…
విజయవాడలోని సితార, రాజరాజేశ్వరి పేట, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ముంపు కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలకు పూర్తిగా ఇళ్లు మునగడం తో అపార్ట్మెంట్ల పైన, కొండలపైన తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు. వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఇళ్ల వద్దకు వచ్చి పరిస్థితి ఏరకంగా ఉందో చూసుకుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లు ముంపు…
Vijayawada Floods : బుడమేరు కాలువ, కృష్ణానది కారణంగా విజయవాడలో వరదలు ఎన్నడూ లేనంతగా అజిత్ సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, నున్న, పాయకాపురం, ప్రస్తుతం రామలింగేశ్వరనగర్, భవానీ పురంలపై ప్రభావం చూపుతున్నాయి. సోమవారం ఈ ప్రాంతాలు నీట మునిగాయి, వేలాది మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు. సోమవారం తెల్లవారుజామున కృష్ణానది నుంచి వరదనీరు ప్రవహించడంతో రామలింగేశ్వరనగర్లోని ఇళ్లలోకి ప్రహరీ గోడలు విరిగిపడ్డాయి. ఆరు అడుగుల మేర నీరు చేరడంతో పోలీస్ కాలనీతోపాటు చుట్టుపక్కల రోడ్లపైకి నీరు చేరింది.…
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం జరిగిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలకు నష్టపోయిన రైతులు జిల్లాలపై అధికారులతో రివ్యూ చేశామని ఆయన తెలిపారు. తెలంగాణలో 8 జిల్లాలకు తీవ్రమైన ప్రభావం పడిందని, ఇరిగేషన్ అధికారులతో పోలీస్ శాఖతో జిహెచ్ఎంసి సిబ్బందితో సమావేశం నిర్వహించామన్నారు. వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి సహాయం చేయాలని నిర్ణయించామని,…
తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది… నిన్న రాత్రి వరకు 177 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. ఇవాళ ఉదయం నుంచి 96 రైళ్లను రద్దు చేసింది… నిన్న రాత్రి వరకు 120 రైళ్ళను దారి మళ్ళించింది… ఇవాళ ఉదయం నుంచి 22 రైళ్లను దారి మళ్ళించింది… నిన్న రాత్రి వరకు 9 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది ఇవాళ దాదాపుగా 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది……
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు ఆ సాయం అందించాలని…
కోదాడ, హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. వర్ష ఉధృతికి గండ్లు పడ్డ ప్రాంతాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శిస్తున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం రామచంద్రాపురం శివారులో సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ రెడ్డిలు పరిశీలించారు. వీరితో పాటు నీటిపారుదల శాఖాధికారులు సి.ఇ రమేష్ బాబు, యస్.ఇ శివధర్మ తదితరులు…
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలకు అతలాకుతలమవుతున్నాయి. అయితే.. అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ట్విట్టర్, సోషల్ మీడియాలకే కేటీఆర్ హరీష్ రావులు పరిమితమయ్యారని విమర్శించారు. వారు ప్రజలను మర్చిపోయారని, తమది గడిల పాలన కాదని, మేము గడి లకు పరిమితం కాలేదన్నారు భట్టి. వరదలు రాగానే ప్రజలలోనే వున్నామని, సహాయ చర్యలను అందించామన్నారు. రెస్క్యూ ఆపరేషన్…