టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి తరలిస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగింది. పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించాలన్న తన ఆదేశాలను కొనసాగించేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. అయితే.. హైదరాబాద్ మియాపూర్‌లో నందిగం…
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5న గురు పూజా దినోత్సవం జరుపుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తుంటాము. పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. అందుకే వారిని…
అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా గాలి వీస్తున్నా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో సైతం గట్టుపైనే గడిపారు మంత్రి రామానాయుడు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్‌కు వరద…
విజయవాడలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే బుడమేరు వరద ముంపుతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతుండటంతో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఇంకా జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, అంబాపురం, సింగ్ నగర్లో ఇంకా వరద నీరు నిలిచి ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ వరద బాతులకు సహాయ కార్యక్రమాల్లో ఇటువంటి ఆటంకాలు ఉండకూడదని, వారికి అవసరమైన…
నేడు శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ పర్యటించనున్నారు. గురుపూజోత్సవంలో రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 5 గురువారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం మళ్లీ ఏర్పడే అవకాశం ఉన్నందున, ఈ వారంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో తడి వాతావరణం ఎదురుకావచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. “ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర లో నేటి నుంచి 8వ తేదీ వరకు, దక్షిణ కోస్తా లో ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు వానలు ఏకధాటిగా…
ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు , వరదల కారణంగా వారి సంఖ్య 32కి పెరిగిందని, సహాయక శిబిరాల్లో ఉన్న వారి సంఖ్య 45,369కి పెరిగిందని అధికారులు తెలిపారు. విజయవాడలో అత్యధికంగా ప్రభావితమైన ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మరణించారు; గుంటూరు (ఏడు), పల్నాడు (ఒకటి) అధికారికంగా విడుదలయ్యాయి. వరద బీభత్సానికి గురైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలను గురువారం కేంద్ర ప్రభుత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖల బృందం సందర్శించి బాధితులతో సంభాషించనుంది. కేంద్ర బృందంలో…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన కాలువలలో ఒకటైన బుడమేరు విజయవాడలోని అనేక నివాస ప్రాంతాలను వరదలు ముంచెత్తడం, ముంపునకు గురికావడంతో రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. సింగ్ నగర్, పాయకాపురం, వైఎస్ఆర్ కాలనీ తదితర ప్రాంతాలు ముంపునకు గురికావడానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అయితే.. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నుంచి తేరుకుంటున్నారు బెజవాడ ప్రజలు. అయితే.. 80 శాతం ప్రాంతంలో నీరు తగ్గుముఖం పట్టింది. సహాయ చర్యలు ఊపందుకుంటున్నాయి. Happy Teachers Day…
Sukanya Samriddhi Yojana: భారతదేశంలోని అమ్మాయిల భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను అందించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో ఓ పెద్ద మార్పు చేయబడింది. ఈ పథకంలో, కుమార్తె చదువు లేదా పెళ్లికి డబ్బును పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే కుమార్తె ఖాతాను నిర్వహించగలరు. ఇది జరగకపోతే ఆ ఖాతాను మూసివేయబడుతుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ రూల్ మార్పు గురించి వివరంగా తెలుసుకుందాం..…
తెలంగాణలో భారీగా వచ్చిన వరదలు వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయామని అయితే తమను ఆదుకోవాలని కనీసం 2000 కోట్ల రూపాయలైనా సరే ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇప్పటివరకు స్పందించ లేదని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు .తెలంగాణలో జరిగిన నష్టం అంచనా వివరాలను కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా వివరించామని అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎటువంటి హామీ లభించలేదని పొంగులేటి అంటున్నారు. ఖమ్మం పర్యటనలో టిఆర్ఎస్ నేతలకి ప్రజల నుంచే తిరస్కారం…
మూడు రోజుల పాటు ఏక దాటినా వచ్చిన వర్షాలకి పాలేరు రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున వరద వచ్చింది. పాలేరు రిజర్వాయర్ సామర్ధ్యాన్ని మించి వరదలు వచ్చాయి రిజర్వాయర్‌లో 21 అడుగుల సామర్థ్యం ఉంటే దాదాపుగా 39 అడుగుల సామర్థ్యం స్థాయి వరద పాలేరుకు వచ్చింది సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్ కి రావటంతో దాని ప్రభావం కాలువల మీద పడింది. వరద కూడా సాగర్ కాలువల మీద పడింది. దీంతో పాలేరు…