బీసీల జీవిత కాల వాంఛ అయిన కుల గణనకు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్‌కి ధన్యవాదాలు తెలిపారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మేమెంతో మాకంత అన్న నినాదాన్ని నిజం చేయడంలో కుల గణన తొలి అడుగు అని ఆయన అన్నారు. తొలి అడుగుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్కకి, తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అణగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేరాలంటే జనాభా లెక్కలు తేలాలన్నారు. అందుకే కుల గణనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని ఆయన పేర్కొన్నారు. బీసీలు అంటే వెనకబడ్డ కులాలు కాదు రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక వర్గాలు అని, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందడానికి ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమే సాక్ష్యమన్నారు. సంక్షేమమే మా అజెండా.. సామాజిక న్యాయమే మా జెండా అని ఆయన ఉద్ఘాటించారు.
Ponguleti Srinivas Reddy : ముగిసిన కేబినెట్ సమావేశం.. నిర్ణయాలు ఇవే..
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీకి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఖైదీలకు క్షమాభిక్ష పై నిర్ణయం తీసుకున్నామని, టీఎస్ లో ఆ పార్టీ పేరు కనిపించేలా పేర్లు మార్చుకున్నారు. ప్రజా ప్రభుత్వంలో అలా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మరో రెండు గ్యారెంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడుతారన్నారు. అగ్రికల్చర్ కు సంబంధించిన ఏఈవో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.