సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ఖేడ్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలను ఆపి మరీ రైతుబంధు ఇచ్చాడని, రేవంత్ మాత్రం ఏసీ రూముల్లో కూర్చోనోళ్లు ఫస్ట్…ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులు లాస్ట్ అంటున్నారన్నారు. అధికారానికి రెండు రోజుల ముందు…హామీలకు రెండేళ్లు వెనక…
ముఖ్యమంత్రి రేవంత్ సీఎం హోదా లో మాట్లాడినట్లు లేదు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మహబూబ్నగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఒక పక్క పెద్దన్న అంటూనే.. ఆ మరుసటి రోజే మోడీ – కేడీ అంటున్నారు.. ఇది ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. నిన్నటి సభలో రేవంత్ టీమ్ మాట్లాడింది చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తొస్తున్నాయన్నారు. మాట్లాడితే మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇవన్నీ ఎవరి సింపతి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. సిడబ్ల్యుసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటి కుంగిన బ్యారేజ్ పియర్స్ ను పరిశీలించింది. ఉదయం 8:30 కు L&T క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న నిపుణుల బృందం అల్పాహారం ముగించుకుని తొమ్మిదిన్నరకు బ్యారేజ్ పైకి చేరుకున్నారు. 9:30 నుండి 1:30 వరకు సుమారు నాలుగు గంటల పాటు బ్యారేజీ లోని…
ఆర్టీసీలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ లో ఉద్యోగులు ఎదురు పీఆర్సీ , పెండింగ్ బిల్స్ పై త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి తో ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన 2017 ,2021 పిఆరిసీ పెండింగ్ బిల్స్ కి సంబంధించిన దానిపై ఈరోజే మాట్లాడతా అని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ, ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రానికి పునాది…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష సరైంది కాదని, ఆయన మాట్లాడే భాష పై సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియా తో మాట్లాడుతూ.. కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఉన్మాద భాష మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 90 రోజుల నుండి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష పై …రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, బొంద పెడతాం, మానవ బాంబులు అయితాం, పండబెట్టి తోక్కుతాం అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు…
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారని ఆయన వ్యాఖ్యానించారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు విడి విడిగా…
దేశం లో ఎక్కడికి వెళ్ళినా మోడీ కి బ్రహ్మరథం పడుతున్నారని, అది చూసి కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేకపోతున్నారన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందుకే మోడీకి కుటుంబం లేదని విమర్శలు చేస్తున్నారని, కానీ దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులు అని మోడీ అనుకుంటున్నారన్నారు. దేశ వ్యాప్తంగా పేదలకు ఇళ్లు కట్టించిన ప్రధానికి సొంత ఇల్లు కూడా లేదని, రోజుకు 18 గంటలకు పైగా పని చేస్తున్న మోడీ నీ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రేవంత్ కు తెలంగాణ “ఆత్మ”లేదు. తెలంగాణపై “గౌరవం” అంతకన్నా లేదు. అందుకే తెలంగాణ “ఆత్మగౌరవం”పై మోడీ సాక్షిగా… రేవంత్ దాడి అసలు తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం. అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్” కు.. “Golden తెలంగాణ మోడల్”తో పోలికెక్కడిది..…
ఎల్ఆర్ఎస్పై ఇచ్చిన జీవో లు రెండు కూడా గత ప్రభుత్వం ఇచ్చినవే కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చిన జీవో లోనే ధరలు నిర్ణయించారని, అనధికార లే అవుట్లు అన్ని.. చెరువులు..అసైన్డ్ భూములు.. ప్రభుత్వ భూములు అక్రమించి చేసినవే అని ఆయన అన్నారు. అక్రమ లే అవుట్లు జరుగుతుంటే మీరు నిద్ర పోయారా.. లేకుంటే మీ నాయకులకు దోచుకోండి అని అనుమతి ఇచ్చారా..? అని…
మంత్రి కొండా సురేఖ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సమక్షంలో 11 మంది వరంగల్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీ లను నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ను, కొండా దంపతులను నమ్మి కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అవుతామన్న వాళ్ళను brs నాయకులు చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీ లను…